Friday, November 22, 2024
HomeతెలంగాణCBI Enquiry : రేపు సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత

CBI Enquiry : రేపు సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు పంపింది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొనగా.. ఆరోజు తన వేరే కార్యక్రమాలున్నాయని.. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. సీబీఐ డీఐజీ డిసెంబర్ 6న కవిత రిక్వెస్ట్ పై స్పందిస్తూ మెయిల్ పంపారు.

- Advertisement -

ఈ నెల 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని మీ నివాసానికి సీబీఐ బృందం వస్తుందని.. ఆ సమయంలో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ మెయిల్ లో పేర్కొన్నారు. అందుకు సమాధానంగా కవిత.. 11వ తేదీ ఉదయం తన నివాసంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో, కవితను రేపు సీబీఐ విచారించనుంది. విచారణలో కవితకు ఈ స్కామ్ లో భాగం ఉందని తేలితే.. ఆమెను కూడా ఒక ముద్దాయిగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News