Saturday, November 15, 2025
HomeతెలంగాణFarmers: రైతులకు శుభవార్త.. ఈ నెల 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం!

Farmers: రైతులకు శుభవార్త.. ఈ నెల 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం!

Cotton procurement: రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జిన్నింగ్ మిల్లుల్లో జాబ్‌వర్క్ టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. దానిని పూర్తి చేసిన వెంటనే కొనుగోళ్లు చేపట్టేందుకు సీసీఐ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సీసీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. సీసీఐ నిబంధనలపై మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో నిర్వహించిన టెండర్లలో మిల్లర్లు పాల్గొనలేదు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐతో పాటు మిల్లర్లతో చర్చలు జరిపి వివాదాలను పరిష్కరించారు.

- Advertisement -

దీపావళి మరుసటి రోజే ప్రారంభం: సీసీఐ ఇచ్చిన హామీ మేరకు మొత్తం 328 మంది కాటన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు జాబ్‌వర్క్ టెండర్లలో పాల్గొన్నారు. ఈ నెల 10న టెండర్లను తెరవగా.. సోమవారం పత్తి శుద్ధి ధరలపై సంప్రదింపులు జరగనున్నాయి. ఈ ప్రక్రియను ఈ నెల 19వ తేదీలోపు పూర్తి చేసి.. మిల్లులతో సీసీఐ ఒప్పందం చేసుకోనుంది. ఆమోదించిన టెండర్ల జాబితాను జిల్లా కలెక్టర్లకు అందిస్తారు. ఆ తరువాత ఆయా మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేస్తారు. ఈ నెల 20, 21 తేదీల్లో దీపావళి పండుగ ఉన్నందున.. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని మిల్లర్లు సీసీఐని అభ్యర్థించారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/land-registration-fraud-by-number-scam-telangana-owner-hardship/

మంత్రి తుమ్మల ఆదేశాలు: ఈ నేపథ్యంలో సీసీఐ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి.. కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం ఆయన పత్తి కొనుగోళ్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మార్కెటింగ్ అధికారులతో మాట్లాడారు. కపాస్ కిసాన్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను కోరారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad