దేశ చరిత్రలోనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. గత ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రైతు గ్యారెంటీ పథకంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ యావత్ రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ రెండు లక్షల రూపాయలు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజులలో పేద వర్గాల కోసం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవ్వనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, సీనియర్ నాయకులు ఉప్పు భద్రయ్య, చెన్నగోని అంజయ్య, ఉబ్బు వెంకటయ్య ,కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ,కొయ్యడ సైదులు, గుండు మల్లయ్య, కేతరాజు అచ్చయ్య, బొంగు జంగయ్య గౌడ్, నల్ల నరసింహ, ఖయ్యూం, ఊదరి నరసింహ, పందుల రాజేష్ గౌడ్, బొబ్బిళ్ళ మురళి, ఉప్పునూతుల నరసింహ, పెద్దగోని రమేష్, దేప రాజు, మాధగోనిని శేఖర్, ఢిల్లీ శేఖర్ రెడ్డి, బండమీది మల్లేష్, మర్రి మల్లికార్జున్రెడ్డి, ఇజాజ్ పాషా, యాదయ్య, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, ఆనంద్, శ్రీను ,లక్ష్మయ్య పాల్గొన్నారు.