Friday, September 20, 2024
HomeతెలంగాణChegunta: వాల్యూస్ అండ్ ఎథిక్స్ పై అవగాహన సదస్సు

Chegunta: వాల్యూస్ అండ్ ఎథిక్స్ పై అవగాహన సదస్సు

లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో..

చేగుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో పంపాటి నాగేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎం పవర్ నిర్మాణ్ వారోత్సవాలలో భాగంగా యువత సాధికారత కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్ చైర్మన్ ధ్యావా లింగమూర్తి హాజరై, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గత సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని వారన్నారు.

ఈ కార్యక్రమంలో చేగుంట మండల నోడల్ అధికారి నీరజ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుర్క నాగరాజు సెక్రటరీ రామచంద్రం ట్రెజరర్ న్యాలపల్లి సతీష్ డిస్టిక్ చైర్మన్ లింగమూర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ ఒంటరి రామిరెడ్డి వర్గంటి నాగరాజు వైస్ ప్రెసిడెంట్ రమేష్ సభ్యులు సూర్య ప్రకాష్ నాగేశ్వరయ్య స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News