చేగుంట మండలం కరీంనగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ స్పేస్ డే ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ ఆకారాలతో రాకెట్ ను పేపర్ ద్వారా డ్రాయింగ్ చేసి విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ అటు చదువులో ఇటు సైన్స్ లో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
విద్యార్థులు మాట్లాడుతూ.. మా పాఠశాల ఉపాధ్యాయులు మాకు ఎంతగానో మమ్ములను అటు విద్యలో క్రీడలలో, సైన్స్ స్పెషల్ డేస్ లో సహకారాలు అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలన్నారు. హిందీ పండిత్ టీచర్ జగన్ లాల్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 మిషన్ గత ఏడాది సరిగ్గా ఈ రోజే చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయినందున దక్షిణ సోలార్ రీజియన్ లో రోవర్ ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించిందన్నారు. ఈ అరుదైన మైలురాయికి జ్ఞాపకంగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరపాలని కేంద్రం నిర్ణయించిందని, అందులో భాగంగానే విద్యార్థులకు సైన్స్ పరంగా వారిని ముందుకు నడిపిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగారావు పెంటా గౌడ్ జగన్ లాల్ విజయేందర్ రెడ్డి కృష్ణమూర్తి వాణి సునీత విద్యార్థులు పాల్గొన్నారు.