Friday, April 4, 2025
HomeతెలంగాణChegunta Rishi memorial celebrates Krishnashtami: రిషి మెమోరియల్ స్కూల్ లో జన్మాష్టమి

Chegunta Rishi memorial celebrates Krishnashtami: రిషి మెమోరియల్ స్కూల్ లో జన్మాష్టమి

చేగుంట మండల కేంద్రంలో రిషి మెమోరియల్ స్కూల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణలో కృష్ణుని జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలతో పాటు ఉట్టి పగలగొట్టి కృష్ణుని చిలిపి చేష్టలు చూపిస్తూ పండగ వాతావరణం కల్పించారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను రిషి మెమోరియల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్-కరస్పాండెంట్ సత్యనారాయణ చైర్ పర్సన్ సుష్మ తెలియజేశారు.

శ్రీకృష్ణుని పుట్టినరోజు నాడు కృష్ణుని వేషధారణతో పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టడం ఆనవాయితీ. విద్యార్థులు తమ తమ విద్యాసంస్థలలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసిక సంతోషాన్ని పొంది, చదువు పట్ల ఇష్టాన్ని పెంపొందించుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News