Sunday, October 6, 2024
HomeతెలంగాణChegunta: శక్తి ఉమెన్స్ ఫిట్నెస్

Chegunta: శక్తి ఉమెన్స్ ఫిట్నెస్

ముఖ్యఅతిథిగా మాసుల శ్రీనివాస్, ఎంపీడీవో చిన్నారెడ్డి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మెదక్ జిల్లా శిశు సంక్షేమ శాఖ వారు నిర్వహించిన నారీ శక్తి ఉమెన్స్ ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, చేగుంట మండల ఎంపీడీవో చిన్నారెడ్డి హాజరై విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి ఆర్ దివ్య 9వ తరగతి రెండవ బహుమతి డి కీర్తన 9వ తరగతి మూడో బహుమతి వై సౌజన్య ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాసుల శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

- Advertisement -

చేగుంట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని పైకి రావాలని గతంలోనే నేను తల్లిదండ్రి లేని అనాధను దత్తత తీసుకున్నాను, ఆమెకు పూర్తిగా పై చదువులకు పూర్తిస్థాయిలో చదివిస్తానని సభాముఖంగా చెప్తున్నాను, ఆమె పేరు ఎన్ ఐశ్వర్య ఇంటర్మీడియట్ చదువుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీవాణి మెదక్ జిల్లా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, ఐసిడిఎస్ స్టాఫ్ అంగన్వాడి టీచర్లు సురేఖ పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News