Friday, April 4, 2025
HomeతెలంగాణChegunta: బడుగు బలహీన వర్గాల స్ఫూర్తిదాత కాన్షిరాం

Chegunta: బడుగు బలహీన వర్గాల స్ఫూర్తిదాత కాన్షిరాం

బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షిరామ్ 18వ వర్ధంతిని పురస్కరించుకొని మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్ గారి ఆధ్వర్యంలో చేగుంటలో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల సమస్య ఈ దేశ సమస్య అని నూటికి 85% ఉన్న బహుజనులు రాజ్యాధికారంలో భాగం కావాలని ఓట్లు మావి సీట్లు మీవా అనే నినాదంతో దేశంలో ప్రకంపనలు సృష్టించిన మహా నేత కాన్షిరాంని బీసీల రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ అమలు చేయించిన ఘనత కాన్సిరాంకే దక్కుతుందని దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడడం వల్లనే. మనువాద పాలకులు వెన్నులో వణుకు మొదలైందని దేశ రాజకీయాలలో చెరగని చిరునామా కాన్షిరాం అని దేశంలోని బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దక్కినప్పుడే ఆయనకు నిజమైన ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు కుతడి నరసింహులు, నాయకులు జనార్దన్ గౌడ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News