Friday, September 20, 2024
HomeతెలంగాణChennamaneni: ఖబడ్దార్ కాంగ్రెస్

Chennamaneni: ఖబడ్దార్ కాంగ్రెస్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై 2 ,000 మందితో వేములవాడలో ధర్నా

ఉచిత కరెంట్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆరెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు గురువారం రోజు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ ఆధ్వర్యంలో తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద 2000 మందితో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయం ఉండి దుబాయ్, మస్కట్, బొంబాయి లాంటి దేశాలకు, రాష్ట్రాలకు వలస పోయినటువంటి పరిస్థితి నుండి మూడు పంటలకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని పండుగ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అన్నారు. 2014 కంటే ముందు మీ 10 సంవత్సరాల మీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క ఎకరాకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. 52 వేల ఎకరాలకు సాగునీరు అందించింది మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబుతున్నారని, ఇదే అప్పటి మా మంత్రివర్యులు హరీష్ రావు సవాలు విసిరితే మీ నాయకులు ఇప్పటి వరకు జవాబు ఇవ్వలేదని అన్నారు. మీ పార్టీకి నూకలు చెల్లాయి అని, ఇక్కడున్న నాయకుడు కోర్టులు చుట్టూ తిరగడం కాదు, ప్రజల చుట్టూ తిరగండి కనీసం డిపాజిట్ అయినా వస్తుందని ,5వ సారి పోటీకి మీరు సిద్దమా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్న సమయంలో మూడు గంటల కరెంట్ సరిపోతదనడం సరైనది కాదన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అరుణా రాఘవ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ మాధవి రాజు,సెస్ చైర్మన్ చిక్కాల రామా రావు,టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జగిత్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, పార్టీ గ్రామ శాఖా అధ్యక్షులు, సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, ఎం.పీ.పీ లు, జెడ్.పీ.టీ.సీ. లు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎం.పీ.టీ.సీ లు, పాక్స్ చైర్మన్లు, డైరక్టర్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, డైరక్టర్లు,సెస్ డైరక్టర్లు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు, మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News