Friday, October 18, 2024
HomeతెలంగాణCheryala: కార్మికుల పక్షపాతి సీఎం కెసిఆర్

Cheryala: కార్మికుల పక్షపాతి సీఎం కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం లేబర్ బోర్డు ద్వారా కార్మిక కుటుంబాలకు మరణ, వివాహ, ప్రసూతి లబ్ధి చెక్కులను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముస్త్యాల గణేష్ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అనంతల మల్లేశం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశానుసారం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బి ఆర్ టి యు )జిల్లా కార్యదర్శి ముస్త్యాల గణేష్ ఆధ్వర్యంలో లేబర్ బోర్డు ద్వారా కార్మిక లబ్ధిదారుల కుటుంబాలకు మరణ, వివాహ, ప్రసూతి లబ్ధి చెక్కులు చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన పోలోజు ఈశ్వరయ్య కుటుంబానికి లక్ష 30 వేల రూపాయల చెక్కు, కడవేరుగు గ్రామంలో ఇటీవల మరణించిన లింగంపల్లి నరసింహులు కుటుంబానికి లక్ష 30 వేల రూపాయలు చెక్కులను, కొత్త దొమ్మాట లో వివాహ మరియు ప్రసూతి సంబంధించిన 30 వేల రూపాయల చెక్కులను, ఆకునూరు గ్రామంలో వివాహ, ప్రసూతికి సంబంధించిన 30 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ లు కార్మిక సంఘాల నాయకులు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక పక్షపాతి సీఎం కెసిఆర్ అని కార్మికులకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ మరియు బిఆర్టియు సంఘం అండగా ఉంటుందని కార్మికులకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని అందులో భాగంగానే ప్రతి కార్మికునికి అండగా ఉండేలా లేబర్ బోర్డు ద్వారా ప్రమాదమరణానికి, సహజ మరణానికి,వివాహ ప్రసూతి,అసంఘటిత కార్మికులకు,ఆటో కార్మికులకు ప్రమాద బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కార్మికులకు అండగా కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ల ఫోరమ్ అధ్యక్షులు గూడూరు బాలరాజు,బిఆర్టియు మండల అధ్యక్షులు కంతుల రాజు,బి ఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి కొలిపాక మధు,BRSV అధ్యక్షులు రాజశేఖర్,కార్మిక సంఘం నాయకులు పోలోజు బాలరాజు,కర్రె నర్సింలు, భూమిని భాస్కర్,కనకయ్య కార్మిక సంఘం నాయకులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News