Thursday, September 19, 2024
HomeతెలంగాణCheryala: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అసత్య ఆరోపణలు

Cheryala: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అసత్య ఆరోపణలు

ఎలక్షన్ వస్తేనే నియోజకవర్గ ప్రజలు గుర్తుకొస్తారా?

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండల శ్రీరాములు వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండింస్తున్నామని చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, మండల పార్టీ అధ్యక్షులు అనంతుల మల్లేశంలు అన్నారు. చేర్యాల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణాకర్, మండల పార్టీ అధ్యక్షుడు అనంతుల మల్లేశం మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని మీటింగ్ పెట్టిన మండల శ్రీరాములు ఎమ్మెల్యే మీద చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉద్యమం నాటి నుండి కేసీఆర్ సారథ్యంలో క్రమశిక్షణ గల నాయకుడిగా పని చేస్తూ ..12 సంవత్సరాలుగా జనగామలో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అటువంటి వారిపై నిన్న మొన్న యాడనో పండి ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే మేల్కొచ్చినట్టు మండల శ్రీరాములు ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఎలక్షన్లు రాగానే పార్టీ గానీ ప్రజలు గాని మండల శ్రీరాములుకి గుర్తొస్తుందన్నారు. ప్రజల మీద యావ ఉన్నోడు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు అని ఎద్దేవా చేశారు. ఇంకొకసారి ఎమ్మెల్యేని ఏమైనా విమర్శిస్తే నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనీయం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరాజు, మండల కో ఆప్షన్ నాజర్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు యూత్ అధ్యక్షుడు ఆకుల రాజేష్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ కొంగరి గిరిధర్, పిఎసిఎస్ డైరెక్టర్ కమలాకర్ నాయకులు లక్ష్మీ నరసయ్య, భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News