Saturday, November 23, 2024
HomeతెలంగాణCheryala: జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి

Cheryala: జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి

నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ చైర్మన్ డా. మహమ్మద్ యాసీన్

రాష్ట్ర పలు దిక్కుల్లో ప్రజల సమస్యలపై పోరాడానికి సిద్ధం చేస్తానని,పేద ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తానని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ చైర్మన్ డా.మహమ్మద్ యాసీన్ నియామక పత్రాన్ని అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థలో అతి తక్కువ సమయంలో రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానని, సంస్థ నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించడం సంతోషకరం అని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిటీ సంస్థ ఏ పార్టీలకు, సంఘాలకు అనుబంధం కాదని నీతి అయోగ్ ద్వారా ఆమోదం పొందిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని స్పష్టం చేశారు.

- Advertisement -

మానవ సేవే మాధవ సేవగా భావిస్తానని, అతి తొందరలో రాష్ట్ర పలు దిక్కుల్లో ప్రజల సమస్యలపై పోరాడానికి సిద్ధం చేస్తానని,పేద ప్రజలకు అండగా ఉంటూ మానవ హక్కులకు, చట్టపరమైన నియమ నిబంధనకు లోబడి ఉంటూ, ప్రజలకు ప్రభుత్వనికి మధ్య వారధిగా ఉంటూ సంస్థ యొక్క పేరును నిలబెట్టే దిశగా కృషి చేస్తానని, దీనికి అందరూ సహకరించాలని, జిల్లా, మండల కమిటీలతో త్వరలోనే రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలొ నేషనల్ చైర్మన్ డా.మహమ్మద్ యాసీన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చారగొండ రమేష్ రెడ్డి, ప్రచార కార్యదర్శులు ఎలకంటి రాజు, యాసారపు కర్ణాకర్, ములుగు జిల్లా అధ్యక్షుడు పాలతీయ రాజ్ శేఖర్ నాయక్, బచ్చనపేట మండల అధ్యక్షులు ఇజ్జగిరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News