ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేవెళ్ల నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ… గత తొమ్మిది రోజులుగా ఆశా వర్కర్స్ సమ్మె చేస్తున్నారని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యేను కోరామన్నారు. ఆయన స్పందించి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారన్నారు. తెలంగాణలో కూడా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వంతో చర్చించాలని విన్నవించామన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలన్నారు. ఆశాల సమస్యల పరిష్కరించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి సలహాదారులు ధనలక్ష్మి షాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి మాధవి కోశాధికారి జయమ్మ చందన్ వెళ్లి అధ్యక్షురాలు స్వప్న సబిత మంజులా రాణి లలిత సరిత నిర్మల తదితరులు పాల్గొన్నారు .