దసరా నవరాత్రులు భాగంగా వివేకానంద జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అన్నారు.
దేశం పువ్వులతో దేవుళ్లను పూజిస్తే తెలంగాణ రాష్ట్రంలో పువ్వులనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పూజిస్తే పరోక్షంగా ప్రకృతి పూజించి నట్లే అన్నారు. విద్యార్థులు భక్తి భావంతో ఆధ్యాత్మికతను కలిగి ఉండాలన్నారు. ఆధ్యాత్మికత మనిషికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది అన్నారు.
పువ్వులనే పూజించే బతుకమ్మ పండుగ భక్తితో తెలంగాణ రాష్ట్రప్రజలు జరుపుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అన్నారు. 9 రోజుల ఈ పండుగ తీరొక్క పూలను పూజిస్తారన్నారు. విద్యార్థినుల ఆటపాటలతో కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.