Wednesday, February 12, 2025
HomeతెలంగాణChicken: చికెన్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

Chicken: చికెన్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక

భయపడద్దు

చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ వార్నింగ్ జారీ చేసింది. కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (హెచ్5ఎన్1 – బర్డ్ ప్లూ) వైరస్ కారణమని నిర్ధారించారు.

- Advertisement -

కొన్ని రోజులు జాగ్రత్త

ఈ వ్యాధి కోళ్లలో వేగంగా వ్యాపిస్తూ తెలంగాణకు కూడా విస్తరించనుందన్న సమాచారం నేపథ్యంలో కొన్ని రోజులు కోళ్ల పెంపకం, మాంసం వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ముందస్తుగా జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ విభాగం తెలిపింది.

కోళ్లు చనిపోతే చెప్పండి

కోళ్లు, ఇతర జంతువులలో సంభవించే అనుమానస్పద, వైరస్ మరణాల వివరాల పట్ల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ప్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొంది. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత వెటర్నీ దవాఖానలో సమాచారం ఇవ్వాలని యాజమానులకు సూచించారు. ఇప్పటికే బర్డ్ ప్లూ వ్యాధిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి తేవద్దు

వెటర్నీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించాలని, ప్రతి సమాచారం అందించాలని కోళ్ల ఫారాల యాజమానులకు కలెక్టర్లు సూచించారు. మరోవైపు బర్డ్ ప్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కోళ్లు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ (కోళ్ల దానా) దిగుమతులను పశుసంవర్ధక శాఖ నిషేధించినట్లు తెలుస్తోంది. అవి ఇతర రాష్ట్రాల నుంచి రావడం ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందని ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో బతకలేదని, కోడి మాసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అధికారులు మాత్రం బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News