Sunday, September 8, 2024
HomeతెలంగాణChoppadandi: ఆ ఎమ్మెల్యే దద్దమ్మ

Choppadandi: ఆ ఎమ్మెల్యే దద్దమ్మ

రైతులూ.. ఆందోళనకు గురి కావద్దు

చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి రైతును కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం లోని గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీటిని విడుదల చేయడానికి సాంకేతిక సమస్య అడ్డు వచ్చిందనీ, గత ప్రభుత్వం కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ కరెంటు కనెక్షన్ తొలగించారన్నారు.

- Advertisement -

రైతు సమస్యలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి కరెంటు సమస్యను పరిష్కరించామన్నారు. గాయత్రి పంప్ హౌస్ నుండి వరద కాలువకు నీటిని విడుదల చేయించామన్నారు. చివరి మడి వరకు సాగునీరు అందజేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటామన్నారు.


ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దనీ గతంలో పంటలకు సాగునీరు అందక నష్టం వచ్చిందని, నష్టపరిహారం చెల్లించాలని రైతులు అడిగితే రాళ్ల వాన పడి నష్టం వచ్చిందనుకోవాలని రైతులను హేళన చేసిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు ధర్నా చేసే నైతిక హక్కు లేదన్నారు. గత ఏడాది భారీ వర్షాలకు రాళ్ళ వాన పడి పంటలు దెబ్బతిని రైతులు పూర్తిగా నష్టపోతే, స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రామడుగు మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఎక రాకు 10 వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించాడు.

చొప్పదండి నియోజకవర్గం లోని రైతులకు నష్టపరిహారాన్ని ఇప్పించలేని చేతగాని దద్దమ్మ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అని అన్నారు. గాయత్రి పంపు హౌస్ నుండి వరద కాలువకు నీటిని విడుదల చేయడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గం రైతాంగం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News