Saturday, November 23, 2024
HomeతెలంగాణChoppadandi: పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్

Choppadandi: పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్

త్వరలో దేశరాజ్ పల్లె గ్రామాన్ని దత్తత తీసుకుంటా

చొప్పదండి నియోజకవర్గంలోని ఇంట్లో పెద్ద కొడుకులా ప్రతి కుటుంబానికి అండగా ఉంటానంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. 24 గంటల విద్యుత్ రాదంటూ ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని, ప్రజలు రైతులు వారి మాటలను నమ్మి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ అందజేస్తుందని సత్యం హామీ ఇచ్చారు. రైతులు పండించిన ధాన్యానికి 2500 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మహిళల కళ్ళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో మహిళల కోసం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారన్నారు.

- Advertisement -

అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి. అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అప్పుల పాలు కావద్దన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలతో ఉచిత వైద్యం చేయించుకోననేలా చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎలాంటి జబ్బుకైనా కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజలు ఆరోగ్యశ్రీని సద్వినియోగం చేసుకొని ఉచితంగా వైద్య చికిత్స చేయించుకోవాలన్నారు ఎమ్మెల్యే సత్యం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశరాజ్ పల్లె గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న మాట నిలబెట్టుకుంటాను. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, MPP కలిగేటి కవిత, గ్రామ సర్పంచ్ కోల రమేష్, ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్, PD DRDA శ్రీ లత, తహసీల్దార్ భాస్కర్, MDO భాస్కర్ రావు, అసిస్టెంట్ డిఎంహెచ్ఓ జుబెరియా బేగం, ఆర్టీసీ డిపో మేనేజర్, మండల వైద్యాధికారి రమేష్, ఏఎన్ఎం అసిస్టెంట్ ఏఎన్ఎంలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News