Friday, April 4, 2025
HomeతెలంగాణChoppadandi: నామినేషన్ వేసిన సుంకే రవి

Choppadandi: నామినేషన్ వేసిన సుంకే రవి

స్టెప్పులేసి డ్యాన్సు చేసిన సుంకే రవి

భారీ జన సందోహంతో నామినేషన్ వేశారు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్.

- Advertisement -

బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు ప్రజలతో జనసముద్రమైన చొప్పదండిలో..స్టెప్పులేశారు బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ విజయం తథ్యమని.. కారు గుర్తుకు ఓటు వేసి సౌమ్యుడు, స్థానికుడు రవిశంకర్ ను గెలిపించాలని వినోద్ అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య, ఉపాధితోపాటు స్వయం ఉపాధికి అవసరమైన సాయం కూడా కేసీఆర్ సర్కారు చేస్తోందని, అభివృద్ధి కోసం మళ్లీ కేసీఆర్ కే పట్టం కట్టాలని సుంకే రవి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News