Sunday, July 7, 2024
HomeతెలంగాణChoppadandi: ఆదర్శ నియోజకవర్గంగా చొప్పదండి

Choppadandi: ఆదర్శ నియోజకవర్గంగా చొప్పదండి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

అభివృద్ధిలో అగ్రగ్రామిగా ఆదర్శ నియోజకవర్గంగా చొప్పదండి నియోజకవర్గాన్నీ తీర్చిదిద్దుతానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలంలోని గుండి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆరు గ్యారంటిల్లో ప్రతీ హామీని నేరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 4 గ్యారంటీలను అమలు పరుస్తున్నామని, ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మంగళవారం మరో రెండు పథకాలను ప్రవేశపెడుతున్నామని సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రెండు స్కీములను అమలుచేశామని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు పెంపు చేశామని, గత ప్రభుత్వం మాదిరిగా ఇచ్చిన హామీలను విస్మరించే ప్రభుత్వం కాదని ప్రస్తుతం ప్రజా పరిపాలనలో నడుస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు.
చేవెళ్ల సభ ద్వారా రెండు గ్యారంటీలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని, ఇది శుభపరిణామనీ తెలిపారు. గతంలో గ్యాస్ బండ గుదిబండగా తయారయ్యిందనీ సామాన్య ప్రజలకు సమస్యగా ఉన్న సిలిండర్ ధరను కాంగ్రెస్ ప్రభుత్వ 500 లకే ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను దగా చేసిందని, రుణమాఫీ చేస్తామని చేయలేదని తద్వారా రైతులు అవస్థలు పడ్డారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ గురించి స్పష్టమైన ప్రకటన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చేస్తారని, దానితో పాటు రైతుకు పెట్టుబడి సహాయం కింద అందజేసే రైతు భరోస పథకాన్ని కూడా త్వరలో అందజేస్తామని తెలిపారు. ఇది పూర్తిగా రైతు, కార్మిక, కర్షక ప్రభుత్వమని ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటిలను అమలు చేసి తీరుతామని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరవెల్లి తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీ మెంబర్ తడగొండ నర్సింగ్బాబు, రామడుగు ఎంపీటీసీ- 2 బొమ్మరివేని తిరుమల, వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీష్,మాజీ ఎంపీపీ తడగొండ అంజలి హనుమంతు, ఎంపీడీవో రాజేశ్వరి,ఏ. ఈ సచిన్, అల్గి చైర్మన్ ఉప్పుల అంజని ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పంజాల శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు సుధీర్,రామడుగు ఎస్టీ సెల్ అధ్యక్షుడు మానుపాటి వెంకటేష్,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి దుర్గం సాయి కృష్ణ, గుండి గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తి లచ్చయ్య, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News