Saturday, November 23, 2024
HomeతెలంగాణCITU: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల, ఐకేపీ వీవోఏల సమస్యలను పరిష్కరించాలి

CITU: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల, ఐకేపీ వీవోఏల సమస్యలను పరిష్కరించాలి

సెంటర్ ఆఫ్ ట్రెడ్ యూనియన్స్ (సీఐటీయు) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… సింగరేణి సంస్థలో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని 2018 ఎన్నికల సందర్భంగా రామగుండంలో మీరు, సింగరేణి ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల కవిత (నాడు ఎంపి, టిజిబికెఎస్ గౌరవాధ్యక్షురాలు) కొత్తగూడెంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తెలంగాణలో అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో నేడు సుమారు 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిలో, సింగరేణి సాధిస్తున్న లాభాలలో, సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టీపిఎసి, ఎన్ఎండిసి, ఐటిసిలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపిఎండిసి తదితర పరిశ్రమలలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన జీఓకి అదనంగా రెండు వేల నుంచి ఐదు వేల వరకు చెల్లిస్తున్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వంపై నయా పైస భారం పడదు. ఈ నేపథ్యంలో తమరు జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రంలో ఐకేపీ వీవోఏలు గ్రామల్లో మహిళల అభివృద్ధిలో, స్వయం ఉపాధి కల్పిస్తు, ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఐకేపీ వీవోఏలు గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్నారు, కావున ప్రభుత్వం వివోల సమ్మె పై స్పందించి వారిని ప్రభుత్వం సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీసం వేతనం అమలు చెసి, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని, మరియు రాష్ట్రములో రైతుల పశువులకు వైద్యం అందించే దిశగా పశు మిత్రలు గత 8 సం|| ల నుండి చేస్తున్నారు. విరికి ప్రభుత్వం మాత్రం ఎలాంటి వేతనం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పశు మిత్రలకు కనీస వేతనం, సెర్ఫ్ నుండి ఐడి కార్డులు, యూనిఫామ్ లు, వారికి వైద్యనికి ఉపయోగపడే వైద్యం పరికరాలు, మందులు అన్ని ఉచితంగా ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల ప్రకారం నిరుపేద కార్మికులకు, ప్రజలకు డబుల్ బెడ్ రూం, ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News