Monday, January 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: ఎక్కడున్నా తెలుగు వారంతా ఒక్కటే: సీఎం చంద్రబాబు

Chandrababu: ఎక్కడున్నా తెలుగు వారంతా ఒక్కటే: సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల(World telugu federation conference)ను ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం ఎన్టీఆర్(NTR)‌ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

- Advertisement -

అనంతపురం నుంచి ఆదిలాబాద్‌ వరకు..శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే అన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చారన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాష, సంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని పేర్కొన్నారు.

కాగా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు, సినీ నటులు, విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. ఇక ఈనెల 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి(Revanth Reddy) హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే ప్రపంచ తెలుగు సమాఖ్యకు 1993లో శ్రీకారం చుట్టారు. తొలి మహాసభలు 1996లో హైదరాబాద్‌లో జరిగాయి. రెండేళ్లకు ఒకసారి హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, దిల్లీ, సింగపూర్, దుబాయ్, మలేసియాలలో తెలుగు మహాసభలు జరిగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News