Sunday, November 16, 2025
HomeతెలంగాణCM relief fund: మనోహరాబాద్ లో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

CM relief fund: మనోహరాబాద్ లో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ మంగళవారం పంపిణీ చేశారు.పది మంది లబ్ధిదారులకు రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తన కార్యాలయంలో లబ్ధిదారులకు వారు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య పట్ల సీఎం కేసీఆర్ సారధ్యంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,వేలాది మంది పేద,మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బిఅరెఎస్ పార్టీ మండల ఉప అధ్యక్షులు రతన్ లాల్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్,మహిపాల్ రెడ్డి,అశోక్,జైరాం,ఆత్మ కమిటీ డైరెక్టర్ బిక్షపతి,నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad