Thursday, April 3, 2025
HomeతెలంగాణPriyanaka Gandhi: ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Priyanaka Gandhi: ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ

Priyanaka Gandhi| కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Mallu Batti Vikramarka) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వీరిద్దరు తొలిసారి ఎంపీగా గెలుపొందిన ప్రియాంక గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు.

- Advertisement -

ఈమేరకు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. “వయనాడ్ లోక్ సభ సభ్యురాలిగా అద్భుతమైన విజయాన్ని సాధించిన శ్రీమతి ప్రియాంక గాంధీని నాతో పాటు ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టీ విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News