Thursday, December 5, 2024
HomeతెలంగాణCM Revanth | గ్రూప్-1 రాసిన అభ్యర్థులకు సీఎం గుడ్ న్యూస్

CM Revanth | గ్రూప్-1 రాసిన అభ్యర్థులకు సీఎం గుడ్ న్యూస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. గ్రూప్-1 పరీక్షలు రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. సోమవారం ఆయన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… 563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం అని చెప్పారు. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోందన్నారు. దీన్ని రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదని, అందుకే సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మెన్ గా నియమించామని తెలిపారు.

వైద్య ఆరోగ్యశాఖలో 14వేల ఉద్యోగాలు భర్తీ చేశాం…

వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ సమర్థవంతంగా పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖ లో 14 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. 7,750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశామన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందన్న సీఎం రేవంత్… తమ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచిందని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News