Sunday, November 16, 2025
HomeతెలంగాణCM Revanth met Ramoji Rao: రామోజీ రావును కలిసిన సీఎం రేవంత్

CM Revanth met Ramoji Rao: రామోజీ రావును కలిసిన సీఎం రేవంత్

ఫిలిం సిటీకి వెళ్లి, గంటకు పైగా చర్చ

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు.

- Advertisement -

లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో సీఎం వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad