Saturday, October 5, 2024
HomeతెలంగాణCM Revanth on HMDA GHMC: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హా హైదరాబాద్ లో..

CM Revanth on HMDA GHMC: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హా హైదరాబాద్ లో..

బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాల్సిందే

హెచ్ఎండీఏ కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు.

  • జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్స్ ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలి
  • చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదు. ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారు.
    *15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయి. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారు.
  • ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాల్సిందే..
  • హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
  • 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందే..
  • చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
  • పుర‌పాల‌క ప‌రిపాల‌న శాఖ‌పై స‌మీక్ష‌…
  • హైద‌రాబాద్ న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
  • కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చ‌ర్యం..
  • ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
  • గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్‌లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశం…
  • కొత్త కార్పొరేష‌న్ల‌కు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని సూచ‌న‌
  • మున్సిపాలిటీల్లో ప‌ని చేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు…
  • జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచ‌న‌
  • ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం ఆదేశాలు
  • హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచ‌న‌
  • జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి హెచ్చ‌రిక… ఉద‌య‌మే లేచి కాల‌నీల్లో ప‌ర్య‌టించని
    జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఇంటికి వెళ్లిపోవ‌చ్చ‌న్న ముఖ్య‌మంత్రి
  • కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామ‌ని వ్యాఖ్య‌
  • హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచ‌న‌
  • మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశాలు
  • వీధి దీపాలు మెరుగుద‌ల‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచ‌న‌
  • వాట‌ర్ వ‌ర్క్స్ స‌మీక్ష‌లో సీఎం..
  • హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశాలు
  • స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచ‌న‌
  • మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌ని ఆదేశం…
  • ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించాల‌ని సూచ‌న‌
  • వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు సూచించిన సీఎం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News