హెచ్ఎండీఏ కార్యాలయంలో వాటర్ వర్క్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.
- జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ పరిధిలో బిల్డింగ్ పర్మిషన్స్ ఫైల్స్ క్లియర్‌గా ఉండాలి
- చాలా బిల్డింగ్స్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్ కనిపించడం లేదు. ఆన్లైన్ లేకుండా ఇష్టారీతిగా పర్మిషన్లు ఇచ్చారు.
*15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతాయి. ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు ఇంటికిపోతారు. - ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందే..
- హెచ్ ఎండీఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోంది..
- 3,500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందే..
- చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- పురపాలక పరిపాలన శాఖపై సమీక్ష…
- హైదరాబాద్ నగరంలో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి
- కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో కమిషనర్లు లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆశ్చర్యం..
- ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
- గ్రూప్ 1 అధికారులు కమిషనర్లుగా ఉండేలా చూడాలని ఆదేశం…
- కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్‌లను కమిషనర్లుగా నియమించాలని సూచన
- మున్సిపాలిటీల్లో పని చేసే మున్సిపల్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు…
- జీహెచ్ ఎంసీలో వయస్సుపైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచన
- ఆస్తి పన్ను మదింపు కోసం డ్రోన్ కెమెరాలను ఉపయోగించేందుకు అధ్యయనం చేయాలని సీఎం ఆదేశాలు
- హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచన
- జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి హెచ్చరిక… ఉదయమే లేచి కాలనీల్లో పర్యటించని
జోనల్ కమిషనర్లు ఇంటికి వెళ్లిపోవచ్చన్న ముఖ్యమంత్రి - కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామని వ్యాఖ్య
- హైదరాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని సూచన
- మల్టీ యుటిలిటీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- వీధి దీపాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచన
- వాటర్ వర్క్స్ సమీక్షలో సీఎం..
- హైదరాబాద్ నగరానికి మంచి నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు
- స్థానిక చెరువులను స్టోరేజీ ట్యాంకులుగా ఉపయోగించుకోవాలని సూచన
- మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగు నీటి సరఫరా అయ్యేలా ప్రణాళిక రచించాలని ఆదేశం…
- ఔటర్ రింగు రోడ్డు బయట ఉన్న చెరువులను క్లస్టర్లుగా విభజించాలని సూచన
- వచ్చే 50 ఏళ్ల తాగు నీటి అవసరాల కోసం ప్రణాళికలు రచించాలని అధికారులకు సూచించిన సీఎం