రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయించింది. దీంతో రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేసిన సీఎం, కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వివరించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి చొరవను బీసీ నేతలు స్వాగతించారు.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం బీసీ కులగణనపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, ఉన్నత అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారంలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు.