సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో నలగొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్(KCR)గురించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన నాంపల్లి స్పెషల్ కోర్టుకు వచ్చారు. సీఎం రాకతో కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డి వాంగ్మూలం రికార్డు చేసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేసింది.
కాగా ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో నల్గొండ టూ టౌన్, కౌడిపల్లి, బేగంబజార్, ఓయూ సిటీ, తిరుమలగిరి, పెద్దవూర పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా మూడు కేసుల్లో నేడు విచారణకు వచ్చారు.