సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని బండ తిమ్మాపూర్ (Banda Thimmapur) లో రూ.1000 కోట్లతో నిర్మించిన హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ పరిశ్రమకు చెందిన అవిన్యా బెవరేజెస్ ఫాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కోకాకోలా ప్లాంట్ లో పార్టీ నేతలతో కలిసి కలియతిరిగారు. కూల్ డ్రింక్ తయారీ వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -
కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఉన్నారు.