Friday, May 9, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోంది: సీఎం రేవంత్ రెడ్డి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్‌(Delimitation)పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. 1971లో జాతీయ జనాభా తగ్గించాలని కేంద్రం భావించిందని.. దీనిని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం పట్టించుకోలేదన్నారు. దక్షిణాదిలో మాత్రం కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశామన్నారు. అందుకే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించమని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇక పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా.. తక్కువ మొత్తంలోనే తిరిగి పొందుతున్నామని మండిపడ్డారు. కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. తమిళనాడుకు 26 పైసలు.. కర్ణాటకకు 16 పైసలు, తెలంగాణకు 42 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే తిరిగొస్తున్నాయన్నారు. అదే బిహార్‌ మాత్రం రూ.6.06.. యూపీ రూ.2.03, మధ్యప్రదేశ్‌ రూ.1.73 మేర పొందుతున్నాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌.. రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకువస్తుందన్నారు. పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీ కట్టడి చేయాల్సి ఉందన్నారు. గత్లె లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్‌ చేపట్టారని.. ప్రధాని మోదీ కూడా ఇదే విధానం అనుసరించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News