Monday, November 17, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: ప్రజా యుద్ద నౌక గద్దర్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

CM Revanth Reddy: ప్రజా యుద్ద నౌక గద్దర్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి(GADDAR JAYANTHI) సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయనకు నివాళులు అర్పించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో TelanganaCMO) ద్వారా ఓ సందేశం విడుదల చేశారు.

- Advertisement -

“తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన గొంతుక అని స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, వారి పేరుతో అవార్డు(Gaddar Awards) నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుకు చేశారు.” అని ఈ సందేశంలో పేర్కొన్నారు.

కాగా గద్దర్ చివరి రోజుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దగ్గరి నుంచి ఆయన అంత్యక్రియలు ముగిసే వరకు సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబసభ్యులకు ఆండగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad