జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాల్లో(Saraswati Pushkaralu) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్న సంగతి తెలిసిందే. నదిలో పున్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు సర్వసతిదేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ పుష్కరాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
- Advertisement -
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి దక్షిణ త్రివేణి సంగమమైన కాళేశ్వర సన్నిధాన సరస్వతీ పుష్కరాలను ప్రారంభించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా పుష్కర ఘాట్లో పుణ్యస్నానమాచరించి శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించాను” అని పేర్కొన్నారు.