Thursday, April 3, 2025
HomeతెలంగాణRevanth Reddy: ఈనెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర..!

Revanth Reddy: ఈనెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర..!

Revanth Reddy| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూసీ నది వెంట పాదయాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈనెల 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం యాదాద్రి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారట. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. స్వయంగా వారితో మాట్లాడి వారికున్న ఇబ్బందులను తెలుసుకోనున్నారట.

- Advertisement -

అలాగే మూసీ సుందరీకరణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించనున్నారట. వలగొండ మండలంలోని మారేపల్లి నుంచి అనంతసాగరం వరకు పాదయాత్రం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు భారీగా పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News