తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈనెలలో విదేశాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ(Sports University)పై అధ్యయనం చేసేందుకు ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు. అనంతరం ఈనెల 16,17 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించి ఆ దేశంలోని క్రీడా ప్రాంగణాలు పరిశీలిస్తారు. ఈ పర్యటనల్లో రేవంత్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, స్పోర్ట్స్ అథార్టీ చైర్మన్ కే.శివసేనారెడ్డిలు పాల్గొంటారు.
ఇక జనవరి 20 నుంచి 24వ తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు రేవంత్ రెడ్ది హాజరుకానున్నారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ సదస్సుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ సదస్సులో 50కిపైగా దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు.