Thursday, September 19, 2024
HomeతెలంగాణCM Revanth tour in flood hit areas: వరద బాధితుకు అన్నివిధాల అండగా...

CM Revanth tour in flood hit areas: వరద బాధితుకు అన్నివిధాల అండగా ఉంటామన్న సీఎం రేవంత్

సీతారాంపురం తండాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి ఇక్కడే యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించారు… అశ్విని మాతృమూర్తి, సోదరుడుని పరామర్శించా… అశ్విని యువ శాస్త్రవేత్త ఆమె మరణం బాధాకరం. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం.

అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు… ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.

ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు గాను అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్ ను ఆదేశిస్తున్నా. ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకేసారి దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.

ఆకేరు ప్రవాహం… నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి నూతన వంతెన నిర్మించాలని సీఎం ఆదేశం. ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News