Monday, November 25, 2024
HomeతెలంగాణGovt Hostels | సర్కారు హాస్టళ్లకు కలెక్టర్ డెడ్ లైన్..

Govt Hostels | సర్కారు హాస్టళ్లకు కలెక్టర్ డెడ్ లైన్..

Govt Hostels | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సర్కారు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో వారం రోజుల్లో వసతులను మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు డెడ్ లైన్ విధించారు. కళాశాలల్లో శానిటేషన్, భోజన, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్ ల నిర్వహణ బాగుండాలని, నిర్వహణ సరిగాలేని హాస్టళ్ల సంక్షేమ అధికారులు, ప్రిన్స్ పాల్స్, వార్డెన్ల పై కఠిన చర్యలు తప్పవని కూడా కలెక్టర్ అల్టిమేటం జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల, వసతి గృహాల తనిఖీలు చేసేందుకు నియమించిన జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ సోమవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వసతి గృహాల నిర్వహణపై సమీక్షించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వసతి గృహాల (Govt Hostels) స్థితిగతులపై, వసతి గృహాల పనితీరుపై నియమించిన స్పెషలాఫీసర్లు రెసిడెన్షియల్ పాఠశాలను వారానికోసారి మస్టుగా సందర్శించి నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. అందులో కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల పని తీరు బాగాలేదని సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాల కిచెన్ రూమ్, స్టోర్ రూమ్, భోజన శాల, వంటగది నిర్వహణ పనితీరుపై వంద శాతం మార్కులు కేటాయించినట్లు, వసతి గృహాల పనితీరుపై 75 శాతం కంటే తక్కువ మార్కుల వచ్చిన హాస్టల్ వార్డెన్లు, ప్రిన్సిపాల్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు.

వచ్చే వారంలోగా 75 శాతం, అంతకన్నా, తక్కువ మార్కులున్న వసతి గృహాల రెసిడెన్షియల్ పాఠశాలలో వార్డెన్స్, ప్రిన్సిపాల్ తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా సూచించారు. ఆ తర్వాత కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోని అధికారులుంటే, వారిపై సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News