అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నాయకులు
మాజీ ఎంపీ వి. హనుమంతరావు డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పెరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరుల ఆధ్వర్యంలో అమరవీరుల వద్ద బిఆర్ఎస్ నాయకుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి. హనుమంతరావు, రోహిన్ రెడ్డి లు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి, కేటిఆర్ కు మహిళల పట్ల తీవ్ర నిర్లక్ష వైఖరి ఉందని అన్నారు.
మొదటి నుంచి మహిళలను కేటిఆర్ అవమాన పరిచే విదంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో మహిళల పట్ల కేటీఆర్ అవమాన కరంగా వ్యవహరించారని అదే ధోరణి కొనసాగిస్తున్నారని విమర్శించారు.
బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి కూడా అవమాన పరిచే విదంగా అవమాన పరుస్తున్నారని, తెలంగాణ తల్లికి బిఆర్ఎస్ అడుగడుగునా అవమానాలు చేస్తున్నారని, ఇది కొనసాగింపుగా ఈ రోజు కూడా అలాగే తెలంగాణ తల్లిని అవమాన పరిచారని అన్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ తల్లి బొమ్మతో టి షర్ట్ లు వేసుకొని వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని అవమాన పరిచారని అందుకే స్థూపానికి పాలభిషేకం చేశామని అన్నారు. బిఆర్ఎస్ నాయకుల వైఖరి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు.
