తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ హుజూర్ నగర్ నుండి జాన్ పహాడ్ ఉరుసు ఉత్సవాలకు వెళ్తున్నారు. ఒక్కసారిగా గరిడేపల్లి వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడి ఉన్నారు. వారిని చూసిన ఉత్తమ్.. తన డ్రైవర్ ని హఠాత్తుగా కారును ఆపమన్నారు. ..దీంతో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేశాడు. అంతే వెనుకాల వస్తున్న 8 వాహనాలు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. అయితే దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సురక్షితంగా బయటపడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే 8 కార్లకు ముందు వెనక భాగాలు డ్యామెజ్ అయ్యాయి.
Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES