Monday, November 17, 2025
HomeతెలంగాణComrades: సిపిఐ ఉమ్మడి ఆదిలాబాద్ భేటీ

Comrades: సిపిఐ ఉమ్మడి ఆదిలాబాద్ భేటీ

బీజేపీ హటావో దేశ్ కో బచావో అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ సేవా భవన్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

- Advertisement -

నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలు చేసిన చరిత్ర భారతీయ కమ్యూనిస్టు పార్టీకి ఉందని వారు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావంలో సిపిఐ ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. సమానత్వంతో కూడిన పరిపాలన కొనసాగాలని అన్నారు.  90  శాతం దేశ సంపదలను 10 మంది సంపన్నుల చేతిలో పెట్టి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని అన్నారు.  రాబోయే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  రాష్ట్ర కార్యదర్శి కలవేని శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య అసిఫాబాద్ కార్యవర్గ సభ్యులు బద్రి సత్యనారాయణ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్ విలాస్, అదిలాబాద్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదాశివ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు రేగుంట చంద్రశేఖర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నళిని, చిప్ప నర్సయ్య ఏఐఎస్ఎస్ ఎఫ్ కార్యదర్శి కార్ కూరి నగేష్ లింగం రవి కళిందర్ ఖాన్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య బ్రాంచ్ ఉపాధ్యక్షులు కే వీరభద్రయ్య, కొట్టే కిషన్ రావు చంద్రకళ ఆర్ కె పి కార్యదర్శి మందమరి కార్యదర్శి శైలేందర్ సత్యనారాయణ మహిళాలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad