Saturday, November 23, 2024
HomeతెలంగాణCPR: సీపీఆర్ చేయండి, ప్రాణాలు కాపాడండి

CPR: సీపీఆర్ చేయండి, ప్రాణాలు కాపాడండి

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని మేడ్చల్ లోని జీవీకే, ఈఎంఆర్ఐ వేదికగా ప్రారంభమైంది. ఈ ఆలోచన కేటీఆర్ కు వచ్చిందని, సీపీఆర్ తెలిసిన వారు లేక తన మామ ప్రాణాలు కోల్పోయారని హరీష్ రావు వెల్లడించారు. సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని, అందరూ సీపీఆర్ చేయటం నేర్చుకోవాలన్నారు.

- Advertisement -

సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల మన దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున రోజుకి 4000 మంది చనిపోతున్నట్లు అంచనా. అయితే సకాలంలో కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుందని సభలో పాల్గొన్న వారంతా తెలియజేశారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. సి పి ఆర్ సకాలంలో చేస్తే కనీసం 5 మందిని బతికించుకునే అవకాశం ఉంటుందని ప్రపంచ అరోగ్య సంస్థ, ఇతర సంస్థలు చెబుతున్నాయనే విషయాన్ని నిపుణులంతా నొక్కి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా కార్డియాక్ అరెస్ట్ తో 24 వేల మంది చనిపోతున్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్‌ చేసేందుకు చదువు అవసరం లేదు, మెడికల్‌ పరిజ్ఞానం అవసరం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఎవ్వరైనా సీపీఆర్‌ చేసి ప్రాణాన్ని కాపాడవచ్చు. కొంత అవగాహన, కొంత సమయ స్ఫూర్తి ఉంటే చాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News