Monday, November 17, 2025
HomeTop StoriesiBOMMA: 'ఐ బొమ్మ' రవి ఎపిసోడ్‌లో.. షాకింగ్ విషయాలు.. అదిరిపోయే ట్విస్ట్‌లు!

iBOMMA: ‘ఐ బొమ్మ’ రవి ఎపిసోడ్‌లో.. షాకింగ్ విషయాలు.. అదిరిపోయే ట్విస్ట్‌లు!

iBOMMA and Bappam websites blocked: ఆన్‌లైన్‌లో ఉచితంగా సినిమాలు అందిస్తున్న ఐ-బొమ్మ , బప్పమ్ వెబ్‌సైట్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. నిన్న రాత్రి నుంచి ఈ సైట్‌లు ఓపెన్ అవ్వడం లేదు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టే చర్యల్లో భాగంగా పోలీసులు ఈ వెబ్‌సైట్‌లను మూసివేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టనున్నట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

వెలుగులోకి షాకింగ్ విషయాలు: ఈ సైట్లపై జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐ-బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి 1ఎక్స్‌బెట్‌ అనే బెట్టింగ్ మరియు ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలను చూసే లక్షలాది మంది వినియోగదారులను బెట్టింగ్‌ వైపు మళ్లించడమే ఇతడి ప్రధాన లక్ష్యంగా పోలీసులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్ల కోసం అతడు బెట్టింగ్ కంపెనీల నుంచి భారీ మొత్తంలో నిధులను అందుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

అదిరిపోయే ట్విస్ట్‌: పైరసీ భూతంతో గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ప్రశాంతత లేకుండా చేస్తున్న ఐ-బొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన రవిని ముదంస్తు సమాచారంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో అదిరిపోయే ట్విస్ట్‌ ఒకటి బయటపడింది. ఇమ్మడి రవి, అతని భార్యకి మధ్య గతకొంత కాలంగా తగాదాలు నడుస్తున్నట్టుగా తెలింది. ఈ తగాదాలు విడాకుల వరకు సైతం వెళ్లాయి. ఈ కోపంలోనే భర్త హైదరాబాద్‌కు వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించినట్లు సమాచారం. అలా.. భార్య అందించిన ముందస్తు సమాచారంతోనే రవి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు.

Also Read:https://teluguprabha.net/telangana-news/tomorrow-telangana-state-cabinet-meeting-at-secretariat/

చంచల్‌గూడ జైలుకు రవి: ఐబొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని పోలీసులు మెజిస్ట్రేట్‌ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతడిని 7 రోజులపాటు పోలీసులు కస్టడీకి కోరినట్లు సమాచారం. ఐ-బొమ్మ కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా దాదాపు రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ పైరసీ ద్వారా కొన్నేళ్లుగా వందల కోట్ల రూపాయలను ఇమ్మడి రవి సంపాదించినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలింది. అయితే ఈ నెట్‌వర్క్‌లో రవి పాత్ర ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. ఇతడి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వెబ్‌సైట్‌లకు సంబంధించిన నెట్‌ వర్క్‌ ఎక్కడెక్కడ ఉందనే అంశంపై సైతం పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad