Saturday, November 15, 2025
HomeతెలంగాణSharmila Hunger Strike : కొనసాగుతున్న షర్మిల నిరాహారదీక్ష..ఆరోగ్యం క్షీణిస్తున్న వైనం

Sharmila Hunger Strike : కొనసాగుతున్న షర్మిల నిరాహారదీక్ష..ఆరోగ్యం క్షీణిస్తున్న వైనం

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. తనపాదయాత్రను అడ్డుకుంటోందని వాపోతూ.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యాంకక్ బండ్ వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే వెంటనే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్ పాండ్ నివాసం వద్దకు తరలించారు. దీంతో ఆమె తన ఇంటి వద్దే దీక్షను కొనసాగిస్తున్నారు. రాత్రంతా దీక్ష వేదికపైనే కూర్చున్నారు షర్మిల.
మంచినీరు కూడా తాగకుండా దీక్షను కొనసాగిస్తుండటంతో.. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

అపోలో ఆసుపత్రి వైద్యులు చంద్రశేఖర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఆమె కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. మరోవైపు తన కూతురు దీక్షకు సంఘీభావంగా వైఎస్ విజయమ్మ దీక్షాస్థలిలో కూర్చున్నారు. షర్మిల దీక్ష నేపథ్యంలో పోలీసులు లోటస్ పాండ్ ను దిగ్బంధించారు. పార్టీ కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్లో 40 మంది పార్టీ నేతలు, బంజారాహిల్స్ పీఎస్ లో ఏడుగురు నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. పాదయాత్రకు అనుమతినిచ్చేంతవరకూ దీక్ష విరమించబోనని షర్మిల స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad