ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెడ్డి కార్పొరేషన్ ని వెంటనే ప్రకటించాలని రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు , పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని హన్మకొండ లోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో అందచేశారు.
ప్రతి పేద రెడ్డి విద్యార్థికి విదేశీ విద్య కింద 20 లక్షలు కేటాయించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, ఓ.సీ గురుకులాలు, సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేయాలని అందులో డిమాండ్ చేశారు. కాగా, మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి సమస్యలు పరిష్కరింపచేస్తానని హామీ ఇచ్చారు.