Dental Camp| తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డా.శ్రీజ గజవెల్లి, విస్మైల్ డెంటల్ క్లినిక్ డా.అనిత సహకారంతో బీరంగూడలోని ఆర్జిన్ స్కూల్‌లో ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. దంత పరీక్షలతో పాటు దంతాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా టీడీఎస్ఏ(TDSA) వైస్ ప్రెసిడెంట్ డా.శ్రీజ గజవెల్లి మాట్లాడుతూ విద్యార్థులకు దంత వైద్యంపై పూర్తిగా అవగాహన ఉండాలని తెలిపారు. దంత సమస్యల బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు అనంతరం పల్లె దంత సేవ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా దంత వైద్యంపై అవగాహనతో పాటు ఉచిత డెంటల్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడిఎస్ఏ సభ్యులకు, సహకారం అందించిన డా.అనితకి, స్కూల్ యాజమాన్యంకి ధన్యవాదాలు తెలియజేశారు.