Friday, September 20, 2024
HomeతెలంగాణLB Nagar: ఎస్సీ ఉప కులాల ఐక్యవేదిక సమావేశంలో సుధీర్ రెడ్డి

LB Nagar: ఎస్సీ ఉప కులాల ఐక్యవేదిక సమావేశంలో సుధీర్ రెడ్డి

సుధీర్ కు మద్దతిచ్చిన సభ

ఎల్బినగర్ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.
గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎస్సి ఉప కులాల ఐక్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సభలో పలువురు నేతలు మాట్లాడుతూ. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలుపిస్తాం అని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి లాభదాయకంగా ఉందని తెలిపారు. దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది అని తెలిపారు. రాబోయే రోజుల్లో మా యొక్క ఎస్సీ ఉప కులాల సభ్యులము అందరం సుధీర్ రెడ్డి విజయానికి మా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గం ఎంతో ప్రగతి సాధించింది అని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ ఎస్సీ ఉప కులాల సమన్వయ కమిటీ నాయకులు తూర్పాటి చిరంజీవి, ఆడాల రమేష్, జోగు రాములు, మల్లెపాక యాదగిరి, ఏర్పుల గాలయ్య, గోల్కొండ మైసయ్య, ఏర్పుల యాదయ్య, గంగం శివశంకర్, రాజేందర్, హరిబాబు,బాలాజీ గైక్వాడ్,బాల సుందరం,ప్రమీల,అనిత,పార్ధపు శ్రీధర్, సరోజ, నిర్మల, పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News