Tuesday, July 15, 2025
HomeతెలంగాణDharmapuri rush: ధర్మపురికి పోటెత్తిన భక్తులు

Dharmapuri rush: ధర్మపురికి పోటెత్తిన భక్తులు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయం అయిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహుని దివ్యక్షేత్రం భక్తులతో కిటికిటలాడుతోంది. తెల్లవారు నుంచే భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. తెలంగాణలోనే అత్యంత పురాతనమైన, పరమ పవిత్రమైన నవ నారసింహ క్షేత్రాల్లో జగిత్యాల జిల్లాలోని ప్రముఖమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఉదయం 5 గంటలకి స్వామి వారి ఉత్తరద్వార దర్శనాలను ప్రారంభించారు. ముందుగా అత్యంత ప్రముఖులు ధర్మపురి శారదా పిఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, సంక్షేమ శాఖా మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివిధ హోదాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు దర్శనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామి వారి దర్శనము చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News