Monday, November 17, 2025
HomeతెలంగాణEetala: డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రం అభివృద్ధి

Eetala: డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్రం అభివృద్ధి

బీజేపీలోకి కొనసాగుతున్న చేరికలు

డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని కళ్యాణి గార్డెన్ లో నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బురుగు సురేష్ గౌడ్ అధ్యక్షతన సభ నిర్వహించారు.బీజేపీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బెజాడి బీరప్ప ఆధ్వర్యంలో మాజీ ఎంపీ బుర నర్సయ్య గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బచ్చన్నపేట మండల పీఏసీఎస్ వైస్ చైర్మన్ బేజాడి సిద్ధులు, జవాన్ దొమ్మాట శ్రీహరితో 500 మంది యువకులు, రైతులు, మహిళలు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలో భారతదేశం విశ్వ గురువుగా నిలబడడానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి నేడు యువకులు, రైతులు మహిళలు, వృద్ధులు ప్రజలందరూ కాషాయ జెండా ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారని డబులు ఇంజన్ సర్కార్ తోటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. జనగామ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని గడప గడప కాషాయ మయం అవుతుందని, రాబోయే రోజుల్లో జనగామ నియోజకవర్గంలో ఎగరబోయేది కమలం జెండానేనని ఆశా భావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జనగామ నియోజకవర్గ నాయకులు సుదగాని హరిశంకర్ గౌడ్, మండల అధ్యక్షులు సద్ధి సోమిరెడ్డి కన్వీనర్ బల్ల శ్రీనివాస్, నగేష్, చంద్రమౌళి, వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అంజయ్య, లక్ష్మరెడ్డి, చేర్యాల ప్రాంత, జనగాం జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad