Friday, April 18, 2025
HomeతెలంగాణKTR: త్వరలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్

KTR: త్వరలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్

త్వరలోనే బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అయితే అధ్యక్షుడిగా కేసీఆర్‌(KCR)నే ఎన్నుకుంటారా..? లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక 2024 కాంగ్రెస్ ఢోకా నామ సంవత్సరం అని విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు.

- Advertisement -

ఫార్ములా ఈ-కార్ రేస్ ద్వారా హైదరాబాద్ పేరు ప్రతిష్టతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తాము చేసిన ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇందులో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదన్నారు. ఇతర కేసుల్లో మాదిరి కాకుండా ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.

ఇక హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ మరోసారి స్పందించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడారని విమర్శించారు. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకొని ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడట్లేదని ఆరోపణలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News