Wednesday, October 30, 2024
HomeతెలంగాణKarimnagar: అంతర జిల్లా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ల దొంగల పట్టివేత

Karimnagar: అంతర జిల్లా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ల దొంగల పట్టివేత

ఏడుగురిపై కేసు నమోదు

చెడు వ్యసనాలకు అలవాటుపడి , విలాసాలకు మరిగి ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం సరిపోక నలుగురు స్నేహితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలని ప్రవృత్తిగా ఎంచుకుని పలు జిల్లాల్లో అనేక ఎలక్ట్రిసిటీ ట్రాన్సఫార్మర్ల, వ్యవసాయ బావుల కరెంట్ మోటార్లు దొంగతనాలకు పాల్పడి, చివరకు మానకొండూరు పోలీసులకి చిక్కి కటకటాలపాలయ్యారు. మానకొండూరు మండలంలోని ఆపరేషన్ చెంజర్ల పరిధికి చెందిన అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ మేరుగు రమేష్, తండ్రి:రాములు, వయసు 53 సం. నివాసం భగత్ నగర్, కరీంనగర్, ఈ నెల 10వ తేదీ శనివారంనాడు రాత్రి 8 గంటలకు, గట్టుదుద్దనపల్లి గ్రామ శివారులోని 25 KVA DTR కి చెందిన S -22 ట్రాన్స్ఫార్మర్ యొక్క 41 కిలోల రాగి వైండింగ్ కాయిల్స్ దొంగిలించబడ్డాయాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సంఘటన స్థలాన్ని పరిశీలించిన మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న శనివారం నాడు మానకొండూరు ఇన్స్పెక్టర్ సదాశివపల్లి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మానకొండూరు నుండి కరీంనగర్ వైపు వస్తున్న బాలెనొ కార్ నెంబర్ TS 21 D 7715 కారులో ఇద్దరు, వెనకాలే హోండా యాక్టీవా స్కూటీపై ఒకరు, అనుమానాస్పదంగా ఈ ముగ్గురు వ్యక్తులు పోలీసు తనిఖీలను గ్రహించి, పారిపోయే ప్రయత్నం చేయగా అప్రమత్తమై వారిని పట్టుకున్నామన్నారు. కారులో ఒక ఇన్వెర్టర్ , వుడెన్ టేబుల్, రాగి వైరు కట్టను కనిపెట్టామని , స్కూటీ పై ఒక టేబుల్ ఫ్యాన్ ను ఉందని వాటి గురించి అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పటంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి విచారించామన్నారు. విచారణలో వారు నలుగురు స్నేహితులు మానకొండూరుకి చెందిన 1) కొండ్ర ప్రనిందర్ @ ప్రన్వి తండ్రి మహంకాళి వయసు 35 సం. 2) కరీంనగర్ లోని సుభాష్ నగర్ కు చెందిన నెరువట్ల వెంకటేష్ తండ్రి చంద్రయ్య, వయసు 29 సం. 3) కరీంనగర్ లోని రామ్ నగర్ కి చెందిన పార్వతం సతీష్ @ సంతోష్ తండ్రి పోషయ్య ,వయసు 19 సం. 4) కరీంనగర్ లోని సుభాష్ నగర్ కు చెందిన నెరువట్ల అజయ్ తండ్రి లింగయ్య వయసు 21 సం. , ముఠాగా ఏర్పడి పలు జిల్లాల్లో కరీంనగర్ లోని మానకొండూర్, సైదాపూర్, జమ్మికుంట, హుజురాబాద్ , కరీంనగర్ రూరల్, ఎల్.ఎం.డి., పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి , సుల్తానాబాద్ , పెద్దపల్లి , సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక చోట్ల ఎలక్ట్రిసిటీ ట్రాన్సఫార్మర్ల , వ్యవసాయ బావుల కరెంటు మోటార్ల దొంగతనాలకు పాల్పడ్డామని, దొంగిలించిన రాగి వైరును, ఇతర సామాగ్రిని 5)మానకొండూర్ లోని రాజీవ్ నగర్ కు చెందిన సిరిగిరి వెంకటమ్మ భర్త రాజమల్లు వయసు 55 సం. 6)కరీంనగర్ లోని అల్కాపురి కాలనీ కి చెందిన టేకు మల్లేశం తండ్రి అబ్బులు వయసు 63 సం. కోతిరాంపూర్ కి చెందిన 7) లోకిని లక్ష్మి భర్త సదానందం వయసు 38 సం. లకు అమ్మేవారిమని వచ్చిన డబ్బును సమాన వాటాలుగా పంచుకుని వారి అవసరాలు తీర్చుకునే వారిమని విచారణలో వెల్లడించారని, మానకొండూరు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ , పెద్దపల్లి , సిద్దిపేట జిల్లాల్లో పైన తెలిపిన పోలీస్ స్టేషన్ నందు దాదాపు 27 కేసుల వరకు నమోదు కాబడి ఉన్నాయని ఆ దొంగతనాలన్నీ వీరే ఉమ్మడిగా చేసారని కూడా అంగీకరించారని తెలిపారన్నారు. దొంగతనానికి పాల్పడిన వారితో పాటు దొంగిలించిన రాగిని , ఇతర వస్తువులను కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులపై కుడా 379 ఐపీసీ , 136(1) ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆక్ట్ పలుసెక్షన్ ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు . పట్టుబడ్డ ముగ్గురు నిందితుల నుండి ఒక బాలెనొ కారు నెంబర్ TS 21 D 7715 , ఒక నెంబర్ లేని హోండా యాక్టీవ్ స్కూటీ , ఇన్వెర్టర్ , టేబుల్ , టేబుల్ ఫ్యాన్ , 10 కిలోల రాగిని స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులైన కొండ్ర ప్రనిందర్ , నేరువట్ల వెంకటేష్ , పార్వతం సతీష్ లను శనివారం అర్ధరాత్రి మేజిస్ట్రేట్ గారి ఎదుట హాజరు పరచగా కేసును పరిశీలించి రిమాండ్ విధించగా జైలుకు తరలించారని మానకొండూరు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. అంతర జిల్లా ట్రాన్సఫార్మర్ల దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన మానకొండూరు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు అతని సిబ్బందిని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News